మూడు అత్యుత్తమమైన డెస్క్ టాప్ sms అప్లికేషన్లు

డెస్క్ టాప్ కు, ఫోన్ కు మధ్య ఫైల్ షేరింగ్, ఎస్ ఎంఎస్ షేరింగ్ ఆప్షన్లను అందించే మూడు మంచి ఆండ్రాయిడ్ అప్లికేషన్ల వివరాలు సమగ్రంగా మీ కోసం...
Image result for మూడు అత్యుత్తమమైన డెస్క్ టాప్ sms అప్లికేషన్లు
 

3 ఉత్తమమైన ఆండ్రాయిడ్ డెస్క్ టాప్ SMS యాప్స్

డెస్క్ టాప్ నుంచి SMSలు పంపుకొనే అప్లికేషన్ల గురించి మీకు నేను కొత్తగా చెప్పేదేం లేదు. కానీ.... వందలకొద్దీ అప్లికేషన్లు వచ్చేస్తున్న నేపథ్యంలో మీరు సూపర్ స్పీడ్, మంచి ఫీచర్లు ఉన్న అప్లికేషన్నే వాడుతున్నారా? లేక పాత చింతకాయ పచ్చడిలాంటి అప్లికేషన్ వాడుతున్నారా? అన్నది తెలుసుకోవాలన్న కోరిక మీకు లేదా? ఉందీ అంటే.. పదండి మరి ఓ లుక్కేద్దాం.. నచ్చినదాన్ని ఫోన్లో పెట్టేద్దాం..

MightyText

Pushbullet

AirDroid వీటిలో ఏది బెటర్?

 

డెస్క్ టాప్ SMS అప్లికేషన్లు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, KitKat వచ్చాక మన ‘వాడకానికి’ తగ్గట్లు వాటి స్పీడు పెరిగింది. అలా స్పీడుగా పనిచేస్తున్న అప్లికేషన్లలో ప్రధానమైనవి: MightyText, Pushbullet, AirDroid. ఇవన్నీ కూడా ఫ్రీ అప్లికేషన్లే.
మూడూ కూడా చాలా బాగా(WI-FIపై) పనిచేస్తున్నాయి. అయితే మూడింటిలో చిన్న చిన్న తేడాలు కూడా ఉన్నాయి. సెటప్ ప్రాసెస్, అదనపు ఫీచర్లు, కంపాటబిలిటీ వంటి చిన్న చిన్న తేడాలు కచ్చితంగా మిమ్మల్ని మైమరపిస్తాయి. వాటిని తెలుసుకుంటేనే వీటిలో మీకు ఏది సరిపోతుందో తెలుస్తుంది.

MightyTextలో ఫీచర్లు భలే రిచ్ గురూ..

§  ఆండ్రాయిడ్లో డీఫాల్ట్ SMS అప్లికేషన్ అయిన Hangoutsను ఇది సపోర్ట్ చేస్తుంది. వీటితోపాటు Textra, Chomp SMS, Hello SMS, Easy SMS, GoSMSను కూడా ఇది సపోర్టు చేస్తుంది.
§  బ్యాకప్ మరియు SMS సింకింగ్ ఆప్షన్ కూడా ఉంది.
§  మీరు కనెక్ట్ అయి ఉన్న కంప్యూటర్ నుంచి ఫొటోలు, వీడియోలు పంపుకోవచ్చు కూడా.
§  MightyText యొక్క డెడికేటెడ్ అప్లికేషన్ tablet app ద్వారా మీరు ట్యాబ్లెట్ నుంచి టెక్స్ట్ చేయొచ్చు.
§  బ్యాటరీ అలెర్టులు, కాల్స్, మిస్డ్ కాల్స్ కు సంబంధించి నోటిఫికేషన్లు కూడా కంప్యూటర్లో కనిపిస్తాయి.
ఇవన్నీ చదవగానే మీ వేళ్లలో గిలి మొదలైందా?  అయితే వెంటనే క్రోమ్ నుంచి MightyText ఎక్స్టెన్షన్ ఇన్ స్టాల్ చేసుకొని, ఫోన్ లో ఆండ్రాయిడ్ అప్లికేషన్ వేసుకొని టెక్స్టింగ్ మొదలు పెట్టండి మరి. అయితే దురదృష్టమేంటంటే, మైటీ టెక్స్ట్ కేవలం టెక్స్టింగ్ అప్లికేషన్ మాత్రమే కావడం. 

SMSలకు వెంటనే స్పందించే Pushbullet

ఆధునిక ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల వేగానికి తగ్గట్టుగా స్పందించే యాప్ ఏదైనా ఉందీ అంటే అది ఈ Pushbullet అప్లికేషనే అని చెప్పాలి.  
ఫోన్ కు, పీసీకి మధ్య సమాచారం వేగంగా మార్పిడి చేయడానికి సులువైన మార్గంగా ఈ Pushbullet మొదలైంది. ఇందులో పుష్ నోటిఫికేషన్లు సూపర్. మీరు ఈ అప్లికేషన్ వాడడం ద్వారా పీసీ నుంచే ఎస్ఎంఎస్ లకు రిప్లై ఇవ్వవచ్చు.
అయితే Pushbullet అన్నది పూర్తిస్థాయి SMS app కాదన్న సంగతి మీరు గ్రహించాలి. పాత ఎస్ఎంఎస్ లను చూసుకొనే లేదా కొత్తవి క్రియేట్ చేసుకునే యూజర్ ఇంటర్ఫేస్ సిస్టమ్ వీటిలో లేదు.
మీరు ఈ పుష్ బులెట్ ద్వారా కేవలం ఎస్ఎంఎస్ లకు రిప్లైలు మాత్రమే ఇవ్వగలరు. అంటే మీ ఫోన్ కు మెసేజ్ వస్తే, ఆ నోటిఫికేషన్లు మీ పీసీలో కనిపిస్తాయి. వాటికి మీరు సమాధానం పీసీ నుంచే పంపొచ్చు. నోటిఫికేషన్ రాకపోతే మీరు ఏం చేయలేరు.
అలాగే ఇందులో హ్యాంగవుట్(ఆండ్రాయిడ్ 4.4లో ఇదే డీఫాల్ట్ మెసేజింగ్ యాప్) సపోర్ట్ లేదు. EvolveSMS, Textra, chomp SMS వంటి మూడోపార్టీ ఎస్ఎంఎస్ క్లయింట్లకు మాత్రం ఇది సపోర్టు చేస్తుందండోయ్.

AirDroid కేవలం టెక్స్టింగ్ యాప్ మాత్రమే కాదు.. ఇదో డివైస్ మేనేజ్మెంట్ సూట్

నిజానికి ఈ AirDroid నా ఫేవరెట్ అప్లికేషన్. మైటీ టెక్స్ట్ లా దీంట్లో బోలెడన్ని ఫీచర్లు లేవు, పుష్ బులెట్ లా ఇది లైట్ వెయిట్ కూడా కాదు. కానీ దీని ద్వారా మీ ఫోన్ ను ఎక్కడి నుంచైనా నియంత్రించవచ్చు.
AirDroid అన్నది డివైస్ మేనేజ్ మెంట్ సూట్ అని చెప్పొచ్చు.
ఒకసారి వెబ్ ద్వారా మీరు పీసీకి ఫోన్ ను కనెక్ట్ చేశాక,
మీరు మీ ఫోన్లోని ఫైళ్లను కంప్యూటర్లోకి పంపుకోవచ్చు,
ఫోన్లో అప్లికేషన్లు ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
స్టోరేజ్ ను కూడా మేనేజ్ చేయొచ్చు.
ఫైళ్లను డిలీట్ చేయొచ్చు,
కంప్యూటర్ నుంచే ఎస్ఎంఎస్ లకు రిప్లై ఇవ్వొచ్చు.
కొత్త ఎస్ఎంఎస్ లు పంపవచ్చు.


సో మీకు నచ్చింది ఎంచుకోండి.. మాకు ఓ లైక్ కొట్టండి.. మరీ నచ్చితే మరిన్ని టెక్నాలజీ వీడియోలు, సమాచారం కోసం సబ్ స్క్రయిబ్ చేసుకోండి...

Comments