TOP 5

ధర తక్కువ-ధగధగలెక్కువ.. భారత్ లో Moto E@Rs.6999


భారతీయులంటే బడ్జెట్ పద్మనాభాలని ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీలన్నిటికీ తెలుసు. మన లాంటి వాళ్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ ఫోన్ Moto E మంగళవారం అర్ధరాత్రి నుంచి Flipkart లో అందుబాటులోకి వచ్చింది. ధర రూ.6,999/-. ఈ ధరలో ఇంతవరకు ఉన్న ఫోన్లతో పోలిస్తే దీని ఫీచర్లన్నీ ధగధగలాడుతున్నాయి. అయితే మెరిసేదంతా బంగారాం కాదన్నట్లుగా ఇది ఉంటుందా లేక నిజంగానే గూగుల్ తన సత్తా చాటుతుందా అన్నది చూడాలి. ఇంతకుముందు ప్రవేశపెట్టిన Moto G.. భారత్ లో బాగా క్లిక్ అయిన నేపథ్యంలో ఆ కింది స్థాయి వారినీ కూడా ఆకట్టుకునేందుకు గూగుల్ ఈ కొత్త ఫోన్ ను మార్కెట్లోకి దించింది.

Moto G వీడియో మరియు ఫీచర్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

No comments

దయచేసి మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాత్రమే ఇక్కడ రాయగలరు. బ్యాక్ లింక్స్ అంగీకరించబడవు.